Satyanveshana    Chapters   

ఉపహారము

కం || ''సత్యాన్వేషణ'' మను

భాసుర ప్రవచనము సల్పిపరతత్త్వంబున్‌

వాసిగ దేట తెనుంగున

జేసితి కృతి భవ నిమోహజేతగ దనరన్‌

ఉ || శ్రీయుత విన్నకోట బుధశేఖర మాధవరాయవర్యనీ

వాయత రీతి కబ్బములనబ్రముగా విరచించి తత్కృతుల్‌

పాయక గూర్చి యర్హులకు బంధురమైన యశోవిభూతికిన్‌

ధ్యేయుడనంగ మించితివి దివ్య సుభాషిత రత్నవై దుషిన్‌

3

మ || జగమెల్లన్‌ గన స్వప్న వృత్త ఘటనాసంబంధియం చెల్లెడన్‌

నిగమాద్యర్ధవిదుల్‌ వచింప వినమే? నిక్కంబ యీమాట: యె

న్నగ సత్యంబది బ్రహ్మమే యనుచు గానంగల్గినంజాలు; సెం

పుగ నీ మోహభహబ్ధిలో మునుగ నే పుణ్యంబు ప్రాపించెడిన్‌.

4

ఉ || ఎందరొ తత్త్వశాస్త్ర విదులెన్నియొ గ్రంధముల& రచించిరే

పుందగ నంచు బల్కుదురుపో! బుధపుంగవులట్లు గాక ! యీ

బంధురతా విమర్శ గుణపాటవమౌ కృతి నేటి సంస్కృతీ

బృందములెల్ల మెచ్చెడి విభిన్న సుభాపములన్‌ రహించెడిన్‌;

గీ || సృష్టియెల్లను నిండి విచిత్ర గరిమ

సగుణ నిర్గుణముల నేక సరణి వెలుగు

నట్టి పరమార్ధ మాయ నిర్యాచ్య వస్తు

వెల్లపుడు నీకు నీప్సితంబిచ్చుగాత.

భవన్మిత్రుడు

తుమ్మలపల్లి శివరావు

Satyanveshana    Chapters